ప్రకాశ్ రెడ్డీ, మేము ఫ్యాక్షన్ వదిలేశాం.. మళ్లీ ప్రారంభించవద్దు: పరిటాల సునీత వార్నింగ్

  • 14 ఏళ్ల క్రితమే ఫ్యాక్షన్ ను వదిలేశాం
  • శాంతియుతంగా ఉన్నాం
  • మాపై దాడులకు ఉసిగొల్పకండి
నిన్న పోలింగ్ సందర్భంగా ఏపీలో పలు చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. పలు చోట్ల హింస చోటు చేసుకుంది. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సైతం దాడులు జరిగాయి. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ను వైసీసీ శ్రేణులు అడ్డుకున్నాయి. వారి వాహనాలపై రాళ్లు రువ్వాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీకి పరిటాల సునీత ఫిర్యాదు చేశారు.

అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ కు హెచ్చరిక జారీ చేశారు. 'ప్రకాశ్ రెడ్డీ, మీకు నేను ఒకటే చెబుతున్నా. 14 ఏళ్ల క్రితమే మేము ఫ్యాక్షన్ వదిలేశాం. శాంతియుతంగా ఉన్నాం. నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఫ్యాక్షన్ ను ప్రారంభించేందుకు ప్రయత్నించవద్దు. మాపై దాడులకు ఉసిగొల్పడం మానుకోండి' అని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
paritala
sunitha
sreeram
topudurthi
Telugudesam
ysrcp

More Telugu News